మదనపల్లె ,సెప్టెంబర్ 9

(మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు ఆల్ ఇండియా కౌన్సిల్ అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఈ) స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులకు వేదికను అందించడం ద్వారా వారిలో ఆవిష్కరణ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ తెలిపారు. హ్యాకథాన్ సమయంలో, బహుళ విభాగ విద్యార్థి బృందాలు విభిన్న డొమైన్లలో సమస్య ప్రకటనలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కృషిచేస్తారని, తద్వారా విద్యార్థులకు నూతన పరిశోధన పై అవగహన పెరుగుతుందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసిటిఈ నిర్వహించిన జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో పాల్గొనడానికి మిట్స్ యూనివర్సిటీ నుండి ఉత్తమ విద్యార్థి జట్లను గుర్తించి, మార్గనిర్దేశం చేయడానికి అంతర్గత రౌండ్ ఒక స్క్రీనింగ్ వేదికగా పనిచేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం, సృజనాత్మక ఆలోచనలు, జట్టుకృషి మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఆర్ మణికంధన్, డాక్టర్ ఆర్ నిత్యా, డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ అండ్ డాక్టర్ మరత ముత్తు, కోఆర్డినేటర్ డాక్టర్ కె.చొక్కనాథన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
