మదనపల్లె సెప్టెంబర్ 9 : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 19 మంది సివిల్ కానిస్టేబుళ్లకు పోలీసు శాఖ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించింది.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పలువురు సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమోషన్‌తో పాటు కేసుల ప్రాధమిక దర్యాప్తు అధికారాలు వస్తాయని, సిబ్బందిపై బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తుచేశారు.
ప్రతి ఒక్కరూ మరింత జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.
