మురాయిస్తున్న సర్వర్లు.. లబ్ధిదారుల ఇబ్బందులు
మదనపల్లె సెప్టెంబర్ 9: మదనపల్లి నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయాలకు వస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు వరకు.. లబ్ధిదారులు దరఖాస్తులు చేత పట్టుకొని సచివాలయంలో వేచి చూస్తూ ఉండిపోతున్నారు. ఆన్లైన్లో నమోదు సర్వర్లు మొరాయిస్తుండడంతో, డిజిటల్ అసిస్టెంట్లు చేసేదేమీ లేక ప్రజలకు నచ్చ చెబుతున్నారు. మూడో రోజు కూడా సర్వర్లు అక్కడక్కడ పనిచేయడం లేదని బాధితులు వాపోతున్నారు.
