జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లి, సెప్టెంబర్ 07 :
మదనపల్లి కలెక్టరేట్ కు వచ్చే పి జి ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలు నందు… ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు.. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ ఏ. వెంకటేష్, కెఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను గడువులోపు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే ఐవిఆర్ఎస్ కాల్స్ నందు పాజిటివ్ పర్ఫార్మెన్స్ (సానుకూల పనితీరు) ప్రజల నుండి సేకరించే అభిప్రాయాలలో పురోగతి సాధించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పనితీరుపై దృష్టి పెట్టి రాష్ట్రంలో జిల్లాను మెరుగైన స్థానంలో ఉండేలా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కుర్చీలలో కూర్చొని వారి సమస్యలను తెలపగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ తదితర అధికారులు వారి సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 336 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
