నేల మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా రెడ్డి మోహన్

వర్గాలకతీతంగా పాల్గొన్న టిడిపి నాయకులు

నిమ్మనపల్లె, సెప్టెంబర్ 7: నిమ్మనపల్లి మండలంలోని ప్రసిద్ధ నేల మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా రెడ్డి మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం వీర మల్లేశ్వర స్వామి ఆలయ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోమలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, మాజీ ఎమ్మెల్యే శోభ, రాటకొండబాబు రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ భాష తనయుడు జునైద్ అక్బరి కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు.
రెడ్డి మోహన్ తండ్రి సీనియర్ టిడిపి నాయకులు అందించిన సేవలకు గాను గుర్తింపుగా రెడ్డి మోహన్ కు నీలం మల్లేశ్వర స్వామి చైర్మన్ పదవి అధిష్టానం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ మండలాధ్యక్షుడు, రాటకొండ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *