మదనపల్లె సెప్టెంబర్ 7 : అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి అధికారులు పని చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మదనపల్లె లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 88 మంది వివిధ సమస్యలతో అర్జీలను ఎస్పీకి అందజేశారు. వీటిలో భూ వివాదాలు 39, కుటుంబ వివాదాలు 16, ఆర్థిక వివాదాలు 12, పరిపాలనా సంబంధిత సమస్యలు 8, మోసాలు 6, న్యూసెన్స్ 3, ఇతర సమస్యలు 3, మరియు వేధింపులు 1 ఉన్నాయి.
భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.
బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ స్పష్టం చేశారు.
