జిల్లా అభివృద్ధికి సమిష్టిగా ప్రణాళికతో పనిచేస్తున్నాం

రాయచోటి, సెప్టెంబర్ 5:

రాయచోటి లోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో… విద్యుత్, ఆర్ అండ్ బి, ట్రాన్స్పోర్ట్ శాఖల అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా మొదట విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విద్యుత్ రంగంలో మౌలిక వసతుల బలోపేతం – సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత

ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సేవలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇప్పటికే 6 లక్షల విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు మంత్రి తెలిపారు.

రాబోయే రోజుల్లో బీసీ వర్గాలకు కూడా సౌర విద్యుత్ కనెక్షన్లను పెద్ద ఎత్తున అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్నమయ్య జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి*

ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష*

అన్నమయ్య జిల్లాలో రోడ్లు–భవనాల శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రహదారుల నిర్వహణ, జాతీయ రహదారుల పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు–భవనాలు, పెట్టుబడులు–మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన వివిధ రహదారి, వంతెనల అభివృద్ధి పనులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని పలు ఆదేశాలు జారీ చేశారు.

  • NH-440 పనుల్లో భూసేకరణ, న్యాయపరమైన అంశాల కారణంగా పెండింగ్‌లో ఉన్న ప్రాంతాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాయచోటి బైపాస్‌కు సంబంధించిన 0.30 కిలోమీటర్ల భాగం కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో .
  • 2025–26 ఆర్థిక సంవత్సరంలో అన్నమయ్య జిల్లాలో రూ.110.45 కోట్ల రవాణా ఆదాయం సమకూరగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8.41 శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయంలో 9.87 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు.

ఈ సమావేశంలో విద్యుత్తు, ఆర్ అండ్ బి, ట్రాన్స్పోర్ట్ శాఖల జిల్లా అధికారులు, ఈఈలు, డిఈలు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *