తంబళ్లపల్లి, సెప్టెంబర్ 4: తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.
వర్షాభావ పరిస్థితులతో తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే, తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ శంకర్ యాదవ్ పేర్కొన్నారు ..
ప్రజా దర్బార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
హంద్రీ–నీవా ప్రాజెక్టు నీటిని తీసుకువచ్చి, నియోజకవర్గంలోని వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపేలా చర్యలు చేపడతాం. తద్వారా తాగునీటితో పాటు రైతుల సాగునీటి కష్టాలను కూడా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
నీటి సమస్య పరిష్కారమే నా మొదటి ప్రాధాన్యత అన్నారు.
