28, 29, 30 వార్డుల్లో ఎమ్మెల్యే షాజహాన్ భాషా పర్యటన.. సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు
మదనపల్లె: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టిన ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమం మదనపల్లె పట్టణంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజలతో నేరుగా మమేకమై వారి కష్టసుఖాలు, స్థానిక సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో 45 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గురువారం 42వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ పరిధిలోని 28, 29, 30వ వార్డుల్లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఆయా వార్డులకు చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు మంగళహారతులు, జయజయధ్వానాలతో ఘన స్వాగతం పలికారు.

ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన
వార్డుల్లో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా.. ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అదే సమయంలో స్థానికుల నుంచి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని ఆదేశించారు.
30వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ దుబ్బిగాళ్ల భాస్కర్, 28వ వార్డు ఇన్‌చార్జ్ గౌస్, టీడీపీ నేత నౌషాద్, 27వ వార్డు ఇన్‌చార్జ్ కరిముల్లా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మదనపల్లె అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మదనపల్లె పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సీపీఎం రోడ్డులో రోడ్డు విస్తరణ పనులను రూ.2 కోట్లతో చేపడుతున్నామని, తద్వారా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అలాగే కదిరి రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోట్ల రూపాయలతో డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకుడు ఫ్రూట్ మండి సర్దార్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, నవీన్ చౌదరి, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ, రామ్మూర్తి నాయుడు, మస్తాన్, రఫీ, డాన్స్ రెడ్డి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, బిల్డర్ రామకృష్ణ, సీనియర్ టీడీపీ నాయకులు మోడెం సిద్ధప్ప, మార్పురీ గాంధీ, నీలకంఠ, పురుషోత్తం, పద్మమ్మ, జాఫరున్నిసా, మాజీ కౌన్సిలర్ రాధా, పులి మహాలక్ష్మి, క్లస్టర్ ఇన్‌చార్జ్ రాజ్‌కుమార్, వేమయ్య, కొప్పల హరినాథ్, అడ్వకేట్ శైలజ, సికిందర్, ఇక్బాల్, టపాసుల బాబా, నాసిర్, లతీఫ్, పోతబోలు వెంకటేష్, టౌన్ బ్యాంక్ సోమశేఖర్ నాయుడు, మెడికల్ షాపు రమేష్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, బాలామణి శేఖర్, ఫిర్దోస్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
