సెప్టెంబర్ 03, 2026 | మదనపల్లె

బసినికొండలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు జనం జైకొట్టారు.. హాజరైన జనసేన ముఖ్య నాయకులు

మదనపల్లె: జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బసినికొండలో ఘనంగా నిర్వహించారు. సీతక యుగంధర్, కత్తి హరి మేస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, తంబళ్లపల్లె జనసేన సీనియర్ నాయకుడు కోప్పల రమేష్, మదనపల్లె జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బసినికొండ గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *