కార్యకర్త కుటుంబాన్ని ఆదుకున్న తెలుగుదేశం పార్టీ MLA షాజహాన్ బాషా

రామసముద్రం, సెప్టెంబర్ 2:
రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన సి. ఆదమ్మ గారు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆమె తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో పార్టీ తరఫున కుటుంబానికి అండగా నిలిచారు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా సహాయంగా రూ.5 లక్షల చెక్కును ఆదమ్మ గారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

కష్టకాలంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి భరోసా కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ చర్యను కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *