మదనపల్లె: శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో నిర్వహించిన తిరుప్పాడ సేవలో మదనపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్, దొమ్మలపాటి సరళ దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన తిరుప్పాడ సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. 🙏🙏
