డీజే సంగీతంతో బైక్ ర్యాలీ.. భారీ కేక్ కటింగ్
తరలిరావాలని పిలుపునిచ్చిన జనసేన రాయలసీమ కో–కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి
మదనపల్లె, సెప్టెంబర్ 1:gtvmedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం మదనపల్లెలో ఘనంగా నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ గంగారపు రామదాస్ చౌదరి తెలిపారు.
ఈ సందర్భంగా డీజే సంగీతంతో భారీ బైక్ ర్యాలీ, అనంతరం అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ర్యాలీ వివరాలు:
బుధవారం ఉదయం 9 గంటలకు మిషన్ కాంపౌండ్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై చిత్తూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె మీదుగా శ్రీదేవి గార్డెన్స్ వరకు కొనసాగుతుంది.
అనంతరం శ్రీదేవి గార్డెన్స్‌లో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అలాగే ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లైవ్ కార్యక్రమంలో యువజన విభాగం ప్రకటన, సందేశం, ఆనంద క్షణాలను ఎల్ఈడీ స్క్రీన్‌పై వీక్షించే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఉదయం 8.30 గంటలకు మిషన్ కాంపౌండ్‌కు చేరుకోవాలని, ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని రామదాస్ చౌదరి సూచించారు.
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
