మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు

మదనపల్లె, ఆగస్టు 31: మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధించింది.

మదనపల్లె పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన గోవర్ధన్ ఈ నెల 24న మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై మదనపల్లె టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.

విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయస్థానం గోవర్ధన్‌కు రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధించింది. దీంతో మదనపల్లె టూ టౌన్ పోలీసులు అతడిని స్థానిక సబ్‌జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *