రామసముద్రం, gtv media ప్రతినిధి:
మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ నాయకుడు పాల బత్తుని సుబ్రహ్మణ్యం అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ చేరిక కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషా, రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు సమక్షంలో నిర్వహించబడింది. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రామసముద్రం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా చేరిన వారిని అభినందించారు.
వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి పాల బత్తుని సుబ్రహ్మణ్యం అనుచరుల భారీ చేరిక
