మదనపల్లి, ఆగస్టు 29: (gtvmedia)మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23, 24వ వార్డుల్లో శనివారం ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆయా వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ వార్డుల్లో పర్యటించిన సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా పర్యటనలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

