నేపాల్ వరదలు.. 320 మంది భారతీయులు మిస్సింగ్

96 మంది భారతీయులు సురక్షితం.. నేపాల్ చేరుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 29: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో 320 మంది భారతీయులతో ఇంకా సంబంధాలు ఏర్పడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఇదిలా ఉండగా, చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. వారిని భారత్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను భారత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *