మదనపల్లి నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా దంపతులు రాఖీ పండుగ కానుకలు అందజేశారు.

రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారికి రాఖీలు కట్టిన ప్రతి ఆడపడుచుకు ఆయన సతీమణితో కలిసి స్వయంగా పండుగ కానుకను అందించారు.
ఈ సందర్భంగా సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే దంపతులు ఆకాంక్షించారు.

