మదనపల్లెలో SIR స్పెషల్ అబ్జర్వర్ పర్యటన

మొక్కను బహూకరించి మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

మదనపల్లె, ఆగస్టు 27: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం మదనపల్లెకు విచ్చేసిన స్పెషల్ అబ్జర్వర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబును జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అబ్జర్వర్‌కు ఎస్పీ పూలమొక్కను బహూకరించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న SIR ప్రక్రియ అమలు, క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలపై అధికారులు కొద్దిసేపు చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *