బ్రేకింగ్ న్యూస్ | మదనపల్లి (gtvmedia )
మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. గురువారం మదనపల్లి డివిజన్ రేషన్ షాపుల డీలర్ల అసోసియేషన్ పిలుపు మేరకు డీలర్లు పెద్దఎత్తున కలెక్టరేట్‌కు చేరుకుని కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకుడు ఖాసీం మాట్లాడుతూ.. రేషన్ బియ్యం బస్తాలను స్కానింగ్ చేసి విక్రయించేలా ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల డీలర్లు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని, కొత్త విధానాన్ని అమలు చేయవద్దని వారు డిమాండ్ చేశారు.
