నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు
సమస్యలు విని అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)ప్రవక్త మహమ్మద్ పవిత్ర జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ప్రజలకు మీలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ నిండాలని ఆకాంక్షించారు.

పండగ రోజున కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా.. సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ.. తాము ఏ సమయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినా అందుబాటులో ఉంటూ తమ సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పండగ రోజున కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
మీలాద్-ఉన్-నబీ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రజలకు శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
