ఉచిత దర్శనానికి 8–10 గంటల సమయం.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2–3 గంటలు
తిరుమల, ఆగస్టు 31: (gtvmedia)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 8–10 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2–3 గంటలు సమయం పడుతోంది. SSD టోకెన్లు పొందిన భక్తులకు 3–5 గంటలలో దర్శనం కలుగుతోంది.
ఆదివారం శ్రీవారిని 81,687 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,938 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా ₹4.36 కోట్ల ఆదాయం లభించింది.
అదే రోజు భక్తుల కోసం 4.05 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.19 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారు. వైద్య సేవలను 3,161 మంది భక్తులు వినియోగించుకున్నారు.
ఓం నమో వేంకటేశాయ 🙏
