చుక్క రామయ్య మృతికి ఎమ్మెల్యే షాజహాన్ భాషా సంతాపం

మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)మదనపల్లె రూరల్ మండలం బసినికొండ-1 టీడీపీ ఇన్‌చార్జ్ చుక్క విజయ్ తండ్రి చుక్క రామయ్య మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా, రాయలసీమ జనసేన కో-కన్వీనర్ రామదాస్ చౌదరి తదితర నాయకులతో కలిసి చుక్క రామయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎన్. విద్యాసాగర్, నవీన్ చౌదరి, బాలు స్వామి, సీటీఎం స్వామి, శ్రీనివాసులు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *