మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలను కప్పిపుచ్చేందుకు టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని మదనపల్లె వైఎస్సార్సీపీ ఇన్చార్జి నిస్సార్ అహమ్మద్ ఆరోపించారు.
ఆదివారం అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. స్పోర్ట్స్ కోటాలో 346 పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారి ఇళ్లకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి వారితో మాట్లాడించడం, ప్రమాణాలు చేయించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మెగా డీఎస్సీపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని నిస్సార్ అహమ్మద్ డిమాండ్ చేశారు.
సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా చలపతి, వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
