
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు పెద్దపీట

మదనపల్లె | జూలై 24 (GTV మీడియా ప్రతినిధి):
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంలోనూ తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మదనపల్లె శాసనసభ్యులు యం. షాజహాన్ బాషా అన్నారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని ఉర్దూ హైస్కూల్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, జడ్పీ హైస్కూల్లలో ‘మెగా పీటీఎం–4.0’ (Mega PTM 4.0) సమావేశాలను అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
