మదనపల్లి, ఆగస్టు 21: (gtvmedia)మదనపల్లికి చెందిన 22 ఏళ్ల యువకుడు మిథిలేష్ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష-2లో తన సత్తా చాటుతున్నాడు. ఫిట్నెస్తో పాటు ప్రశాంతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వంతో జడ్జిలను ఆకట్టుకున్న మిథిలేష్‌కు ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో అతను టాప్-15లో చోటు దక్కించుకున్నాడు.
మదనపల్లి నుంచి బిగ్‌బాస్ వేదిక వైపు అడుగులు వేస్తున్న మిథిలేష్ ప్రస్థానంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. తన ఫిట్నెస్, టాలెంట్‌తో ముందుకు సాగుతున్న ఈ యువకుడికి మదనపల్లి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మదనపల్లి కుర్రోడు మిథిలేష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడతాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
