పేకాట రాయుళ్లకు 4 రోజుల జైలు శిక్ష

మదనపల్లె, ఆగస్ట్ 20: (gtvmedia)
మదనపల్లె పట్టణంలో బహిరంగంగా పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన తొమ్మిది మందికి స్థానిక న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో టిప్పు సుల్తాన్ మైదానం సమీపంలో కొందరు బహిరంగంగా పేకాట ఆడుతున్నట్లు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ దాడి నిర్వహించి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులు ఒక్కొక్కరికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.300 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులను పోలీసులు స్థానిక సబ్‌జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *