మదనపల్లె, ఆగస్టు 19: (gtvmedia)మదనపల్లి ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను, సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్రను పలువురు వివరించారు. ఒక క్షణాన్ని చిత్రంగా భద్రపరచి, ఆ జ్ఞాపకాన్ని భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందని పేర్కొన్నారు.
ఫోటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

