🚨 బ్రేకింగ్ న్యూస్

మదనపల్లి చంద్రకాలనీలో పుర్రె, ఎముకలు కలకలం

మదనపల్లె, సెప్టెంబర్ 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె చంద్రకాలనీలోని భవానీనగర్ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన మృతదేహానికి సంబంధించిన పుర్రె, ఎముకలు బయటపడటం కలకలం రేపింది.

ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మదనపల్లె రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఎముకలు, పుర్రె అక్కడికి ఎలా వచ్చాయి? మృతదేహం ఎవరిది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా వ్యక్తిని హత్య చేసి అక్కడ పాతిపెట్టారా? లేక ఇతర కారణాలతో అవి అక్కడికి చేరాయా? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *