రామసముద్రం మండలంలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలి.. గ్రామాల వారీగా నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లి:

డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మదనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో రామసముద్రం మండలానికి చెందిన కూటమి నాయకులతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. రామసముద్రం మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేస్తూ కూటమి బలాన్ని చాటాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *