ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజేష్‌కు మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు నివాళులు..

మదనపల్లె: విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన పెద్దమండ్యం హెడ్ కానిస్టేబుల్ పొట్టిపాడు రాజేష్ మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు సందర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటన బాధాకరమని పేర్కొన్నారు. రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్ ,ముద్దు ,రఘు రాయల్ ,మల్లెం ప్రకాష్ నాయుడు ,ఐటీడీపీ అధ్యక్షుడు కాశీ శ్రీరామ్ వాల్మీకి,మార్కెట్ యార్డు డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ,సాయి , శ్రీకాంత్ ,KNR తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *