మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్టంగా ఏర్పాట్లు

మదనపల్లె, అక్టోబర్ 15: మదనపల్లి మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియలో ప్రతిష్టంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు.

గురువారం మదనపల్లెలోని దొంతి లేఅవుట్ వద్ద మున్సిపల్ వాహన పార్కింగ్ సమీపంలో ఉన్న సహాయ ఎన్నికల అథారిటీ నూతన భవనంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ గదులను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ప్రమీల కలెక్టర్‌కు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *