మదనపల్లె: పట్టణంలోని సంఘం ఫంక్షన్ హాల్ సమీపంలో లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అకాడమీ కోచ్ మురళి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న కోచ్ మురళిని ఈ సందర్భంగా అభినందించారు.
