మదనపల్లి పట్టణ సమస్యల పరిష్కారం ధ్యేయం

చైర్మన్ శ్రీరామ్ చినబాబు

మదనపల్లి నవంబర్ 15: మదనపల్లె మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చిన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం సెలవు రోజైనా కూడా ఉదయాన్నే లేచి పట్టణంలోని పలుచోట్ల శ్రీరామ్ చిన్నబాబు పర్యటించారు.

ఇందిరానగర్ మున్సిపల్ మస్టర్ కేంద్రంతో పాటు సొసైటీ కాలనీ, సొసైటీ కాలనీ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని, పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇళ్లు లేని వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అవినీతికి తావులేని పాలనతో మదనపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 23న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్మూర్తి నాయుడు , 34 వ వార్డు కౌన్సిలర్ రంగస్వామి నాయుడు , 32 వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తలారి రాధ, 40 వ వార్డు కౌన్సిలర్ శివకుమారి బాష్కర్ , 33 వ వార్డు కౌన్సిలర్ రవి నాయక్ ,46 వ వార్డు కౌన్సిలర్ ప్రభు గౌడ్ ,, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం , నియోజక వర్గ జనరల్ సెక్రటరీ బోనాల ఉమేష్ ,సాయి ,రేగడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *