మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పట్టణంలోని 11వ వార్డు విజయశ్రీ, 32వ వార్డు రాధ, 34వ వార్డు రంగస్వామి, 35వ వార్డు విద్యాధరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చినబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ప్రచార కార్యక్రమాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనగా, పలుచోట్ల ప్రజలు ఆదరాభిమానాలు చూపించారు. మదనపల్లె పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.



