మదనపల్లిలో మహిళ దారుణ హత్య.. నిందితుడు అదుపులోకి!

మహిళ, నిందితుడు ఇద్దరూ కర్ణాటకలోని ములబాగల్‌కు చెందినవారిగా గుర్తింపు

మదనపల్లె:

మదనపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటనలో కీలక వివరాలను వన్‌టౌన్ పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన మహిళ కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న నవీద్ భాష అలియాస్ నవీద్ భాషను కూడా పోలీసులు గుర్తించారు. అతను ములబాగల్‌లోని కురుప్పేటకు చెందిన అక్రమ్ భాష కుమారుడిగా తెలిసింది.

వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *