మదనపల్లి, జూలై 28: (gtvmedia)తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గంలో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఘనంగా ప్రారంభించారు.

మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను నేరుగా కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలను స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పెన్షన్, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరహా ప్రజా సంక్షేమ పాలన కొనసాగాలని తమ ఆకాంక్షను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు చైర్మన్ ఎన్. విద్యాసాగర్, ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి, బీసీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్ధప్ప, రాధ, పులి మహాలక్ష్మి, రాటకొండ భారతి, రాటకొండ శ్రీనివాసులు, డాన్స్ రెడ్డప్పతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
