ప్రభుత్వ సెలవు రోజుల్లో పాఠశాలలో నిర్వహిస్తున్న వారి గుర్తింపు రద్దు చేయాలి

మదనపల్లె, అక్టోబర్ 10: ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కక్కుర్తి పడి తరగతుల నిర్వహిస్తున్నారని వారి విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
రెండవ శనివారం అయినా కూడా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో USFI–అప్సజాక్ నాయకులు వెళ్లి విద్యార్థులను బయటకు పంపి వేసి ధర్నా నిర్వహించారు.

విద్యార్థుల హక్కులను కాలరాసే విద్యాసంస్థల యాజమాన్యాలపై అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా USFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి, APSJAC రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తన్న మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 09-10-2026 నుంచి 21-10-2026 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు సంబంధిత అధికారుల ఉత్తర్వుల జారీచేసిన ఏమాత్రం లేకచేయడం లేదు అన్నారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సెలవులను అమలు చేయకుండా యథావిధిగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థుల నుంచి వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు సంఘాల నాయకులకు తెలిపారు.

మదనపల్లిలోని గౌతమ్ స్కూల్, రాయలసీమ హైస్కూల్, ప్రతిభ హైస్కూల్, మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, జ్ఞానోదయ, నారాయణ, గ్లోబల్ స్కూల్, బూన్ స్కూల్ తదితర విద్యాసంస్థల్లో సెలవుల అమల తీరుపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారుల అనుమతులు ఉన్నాయని చెబుతున్నట్లయితే, ఆ అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతం చేయాలని కోరారు.

ఈ సమస్యను ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కొన్ని విద్యాసంస్థల్లో తరగతులు కొనసాగడం ఆందోళనకరమని నాయకులు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (RIO) తక్షణమే స్పందించి పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలని, సెలవుల ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో USFI అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆఫ్రిద్, జిల్లా కార్యదర్శి కమలాకర్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ రాయల్, మనోజ్ నాయుడు, APSJAC జిల్లా అధ్యక్షుడు గంగరాజ్, మల్లికార్జున, USFI జిల్లా కమిటీ సభ్యులు భార్గవ్, హరీష్, మన్సూర్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో…
కమలాకర్ నాయుడు
జిల్లా కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *