పేదల సేవలో ‘ఎన్టీఆర్ భరోసా’.. పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గంలో ‘పేదల సేవలో – ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

నియోజకవర్గంలోని పసినికొండ పంచాయతీ, డ్రైవర్స్ కాలనీ, నక్కలకుంట, తట్టివారిపల్లి, చేనేత నగర్, భవాని కాలనీ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పెన్షన్ లబ్ధిదారులను కలుసుకుని వారికి పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల పంపిణీ సకాలంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *