మదనపల్లె: పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఇటీవల నియమితులైన మధుసూదన్ నాయుడు మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ నాయుడికి నాదెళ్ల విద్యాసాగర్ అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ అధిష్ఠానం మధుసూదన్ నాయుడికి పుంగనూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మదనపల్లెలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.
నూతన ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన్ నాయుడికి ఈ సందర్భంగా పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కట్ట దొరస్వామి ,టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు జోలిపాలెం చిన్ని, ఎంసీటీవీ రవి, నాదెళ్ల శివన్న, భూమి సీడ్స్ రమణ, రాటకొండ సోము, పసుపు రవి, బోయపాటి రాణా, రాటకొండ మధు , పూల మురళి తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని మధుసూదన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.

మధుసూదన్ నాయుడి నియామకంతో పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు కృషి చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

