తాళ్ల సుబ్బన్న కాలనీలో వైభవంగా వినాయక కళ్యాణోత్సవం

మదనపల్లె రూరల్: మదనపల్లె రూరల్ మండలం కొత్తపల్లి-3 పంచాయతీ పరిధిలోని తాళ్ల సుబ్బన్న కాలనీలో శ్రీ మహాగణపతి ఆలయం వద్ద వినాయక సమేత సిద్ధి, బుద్ధి సమేత కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

వినాయక నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు తాళ్ల కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *