15వ వార్డు కౌన్సిలర్ ఎస్.ఎల్.వి. రఘు ఆధ్వర్యంలో విందు కార్యక్రమం
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భంగా నేడు మదనపల్లె బైపాస్ రోడ్డులోని రామ తులసి కళ్యాణ మండపంలో 15వ వార్డు కౌన్సిలర్ ఎస్.ఎల్.వి. రఘు ఆధ్వర్యంలో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో కలిసి విందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

