మదనపల్లె అక్టోబర్ 29: మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి శ్రీరామ్ కుమార్ చినబాబుకు బలిసి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. గురువారం రాత్రి స్థానిక శ్రీకృష్ణ కళ్యాణమండపంలో బలిజ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాస ప్రసాద్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, బలిజ సంఘం నాయకులు విజయకుమార్ విజయలక్ష్మి భాస్కర్ శ్రీనివాస సూపర్ మార్కెట్ శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో బలిజలు హాజరయ్యారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బలపరుస్తున్న శ్రీరాం చిన్న బాబుకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
మదనపల్లి పట్టణంలో అధిక భాగం ఉన్న బలిజలు అందరూ కలిసికట్టుగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి చినబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు.
