మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)ఖరీఫ్ సీజన్లో రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఖరీఫ్ సీజన్ రైతులు ,కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రుణమాఫీ చేయాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలని, సాగు ఖర్చు తగ్గించాలని, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీరెడ్డి ఉపాధ్యక్షుడు దొరబాబు, సిపిఐ నాయకులు మురళి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలి
