మదనపల్లె, ఆగస్టు 16:( gtvmedia)మదనపల్లి పట్టణంలో రహదారుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. అన్నమయ్య సర్కిల్ నుంచి నీరుగట్టువారిపల్లె రాధాకృష్ణ సిల్క్ హౌస్ వరకు రోడ్డు విస్తరణ పనులకు గౌరవ ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా భూమిపూజ చేశారు.
స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
రోడ్డు విస్తరణ పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా నాయకులు మోడెం సిద్ధప్ప,నీలకంఠ,రామిశెట్టి ఆంజనేయులు,రామూర్తి గంగారపు,మల్లికార్జున,డాన్స్ రెడ్డప్ప,సమర,హరి, రాటకొండ శ్రీనివాసులు పేర్కొన్నారు.
