బురకాయలకోట వద్ద లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

ములకలచెరువు, ఆగస్టు 14: (gtvmedia)అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోట వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు దుర్మరణం చెందాడు.

పోలీసుల కథనం మేరకు.. బురకాయలకోట పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లికి చెందిన ఈ. శంకర్ కుమారుడు గణేష్ తన ద్విచక్ర వాహనంపై బురకాయలకోటలోని ఓ పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన సమయంలో వేగంగా వచ్చిన లారీ అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గణేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *