
మదనపల్లె జీనత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నాయకులు.
మదనపల్లె, జూలై 23: మదనపల్లె పట్టణంలోని జీనత్ ఫంక్షన్ హాల్లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కమిటీతో పాటు వివిధ కమిటీలకు ఎంపికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
సమావేశానికి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా హాజరయ్యారు. అలాగే నియోజకవర్గ పరిశీలకుడు నెట్టెం వెంకటేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కమిటీ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Jai TDP
Jai CBN
Jai Lokesh Anna
Jai Our MLA jaha Anna