హెచ్ఐవి/ఎయిడ్స్‌పై యువతకు అవగాహన అవసరం

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)హెచ్ఐవి/ఎయిడ్స్‌పై యువత పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హుమయూన్ పేర్కొన్నారు. బుధవారం మదనపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాలలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ హుమయూన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు, అన్నమయ్య జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం సూచనల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవి/ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రెండు నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

2026 ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, రిస్క్ ఏరియాల్లో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత హెచ్ఐవి వ్యాప్తి, నివారణ, చికిత్సకు సంబంధించిన అంశాలపై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహనకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించి, వాటి ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు. హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకుండా, వారికి మద్దతు ఇవ్వాలని నిర్వాహకులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *