దిల్లీ, ఆగస్టు 12:( gtvmedia)రోజువారీ లావాదేవీల్లో అత్యధికంగా వినియోగించే రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను చెరి 100 కోట్ల చొప్పున ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.
పాలిమర్ బ్యాంక్ నోట్ల కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి తెలిపారు. ఈ నోట్లను ఎప్పుడు చలామణిలోకి తీసుకువస్తారనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. అలాగే వీటి ముద్రణ, కొనుగోలుకు ఎంత వ్యయం అవుతుందన్నది కూడా ప్రస్తుతం చెప్పలేమని వివరించారు.
ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అనంతరం పాలిమర్ నోట్ల వినియోగం, మన్నిక, భద్రత తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.
