మదనపల్లె, ఆగస్టు 9: (gtvmedia)ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో సందడి చేశారు. చిన్నారుల సంప్రదాయ వేషధారణ, నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ఓ చిన్నారి ప్రదర్శించిన నృత్యాన్ని చూసిన మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా చిన్నారిని అభినందించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులు ప్రదర్శించడం పట్ల కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రశంసలు వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డప్ప, గిరిజన సంక్షేమ అధికారి తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
